వర్కౌట్ అంటే జిమ్ మాత్రమే కాదు.. వీకెండ్ లో ఈ ఫన్ వర్కౌట్స్ ట్రై చేయండి!

వర్కౌట్ అంటే జిమ్ మాత్రమే కాదు.. వీకెండ్ లో ఈ ఫన్ వర్కౌట్స్ ట్రై చేయండి!

వారంలో ఒక్కసారైనా వర్కౌట్ చేంజ్ ఉండాలి అంటున్నారు ఫిట్ నెస్ నిపుణులు.రెగ్యులర్ జిమ్ లో చిన్న మార్పులు చేయడం వల్ల ఫిజికల్, మెంటల్ హ్యాపీనెస్ ను, పైగా వర్కవుట్స్ మీద ఆసక్తిని పెంచుతుందని చెబుతున్నారు. మామూలుగా అయితే వారానికి మూడు గంటల నుంచి ఆరు గంటల  వరకూ వర్కవుట్స్ చేయాలి. మొదట కేవలం 30 నిమిషాల వర్కవుట్ సరిపోతుంది. రోజులు పెరిగే కొద్దీ ఆ టైం పెంచాలి. వారంలో ఒక్కసారి రిలాక్స్డ్ వర్కవుట్లు అవసరం.

అవుట్ డోర్ : వారంలో ఒక్కసారైనా జిమ్ నుంచి బ్రేక్ తీసుకోవాలి. జిమ్ నుంచి బ్రేక్ అంటే వర్కవుట్స్​ కి బ్రేక్ కాదు. వీకెండ్​ లో  హైకింగ్, రాక్ క్లైంబింగ్, వాటర్ బెలూన్ బ్యాటిల్ వంటి అడ్వెంచర్ వర్కవుట్లు ప్లాన్ చేసుకోవచ్చు.

డాన్స్ క్లాస్ : హెవీ వర్కవుట్లు చేసి శరీరాన్ని ఎంత షేప్ చేసినా... మెదడుకు రిలాక్సేషన్ కావాలి. అలా
కావాలంటే యోగా, డాన్స్, సంగీతం వంటివి చక్కని మార్గాలు. వారంలో ఒక్కసారైనా వీటిని ట్రై చేస్తే జిమ్ టైంను బ్యాలెన్స్ చేసినట్టు అవుతుంది. మనసుకు పీస్​ ఫుల్ ఎక్సర్​సైజ్​ అవుతుంది.

బ్యాలెన్సింగ్ యోగా : వర్కవుట్స్​ లో  యోగా భాగమైనప్పటికీ కొన్ని యోగాసనాలు శరీరాన్ని స్ట్రాంగ్​ గా  తయారుచేస్తాయి. చేతుల మీద పూర్తి శరీరాన్ని బ్యాలెన్స్ చేయడం (ఆర్మ్ బ్యాలెన్స్) వంటివి శరీరాన్ని ఫిట్​ గా ఉంచుతాయి.

వాక్ ఆన్ స్టెప్స్ : మెట్లు ఎక్కుతూ, దిగడం పాత స్టైల్ అనిపించొచ్చు. కానీ ఇది చాలా మంచిది. వారంలో ఒక్కసారైనా మెట్ల మీద నడవడం అలవాటు చేసుకోవాలి.

గేమ్స్: వీకెండ్​ లో  టైం దొరికినప్పుడల్లా పిల్లలతో గేమ్స్ ఆడటం, బైక్ రైడింగ్ చేయడం, చుట్టుపక్కల ప్రాంతాలను, గదులను శుభ్రం చేయడం ఇవన్నీ వీకెండ్ వర్కవుట్స్​ లో భాగంగా చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.