మేడిపల్లి, వెలుగు: మద్యం మత్తులో డయల్-100కు పదేపదే ఫోన్ చేసి పోలీసులతో అమర్యాదగా ప్రవర్తించిన వ్యక్తిపై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌లోని చెంగిచెర్ల క్రాంతి కాలనీకి చెందిన డ్రైవర్ ఏళ్లపట్టి వరప్రసాద్‌రెడ్డి(47) ఈ నెల 15న రాత్రి చిన్ని క్రాంతి కాలనీ ప్రాంతంలో మద్యం సేవించి డయల్-100కు నాలుగైదుసార్లు ఫోన్ చేశాడు. పదేపదే ఫోన్ చేస్తూ విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందితో అమర్యాదగా ప్రవర్తించాడు. దీంతో ఆయనపై కేసు నమోదు చేసి చార్జిషీట్ దాఖలు చేశారు. అనంతరం అతడిని ఎల్‌బీనగర్ కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు వెల్లడించారు.
