SBI, ICICI కాదు.. ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంకులు ఇవే.. సగం మంది కస్టమర్లకు తెలియదు !

 SBI, ICICI కాదు.. ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంకులు ఇవే.. సగం మంది కస్టమర్లకు తెలియదు !

ఈ రోజుల్లో కూడా చాలామందికి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం అంటే భయం ఉంటుంది, ఎందుకంటే అందులో నష్టపోయే రిస్క్ ఎక్కువ. అందుకే ఇప్పటికీ చాల మంది  ప్రజలు బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FD) వైపే ఇష్టపడుతుంటారు. ఎఫ్‌డీల్లో డబ్బులు పెడితే మన పెట్టుబడికి పూర్తి భద్రత ఉండటమే కాకుండా, కచ్చితమైన (గ్యారెంటీ) రాబడి లభిస్తుంది. 

సాధారణంగా అందరూ SBI, ICICI , HDFC వంటి పెద్ద బ్యాంకుల్లోనే ఎఫ్‌డీలు చేస్తుంటారు. కానీ వీటికంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు (Small Finance Banks) 5 సంవత్సరాల ఎఫ్‌డీలపై చాలా ఎక్కువ వడ్డీ రేట్లను ఇస్తున్నాయి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు (60 ఏళ్లు దాటిన వారికి) ఇవి మంచి రాబడిని ఇస్తున్నాయి.

5 సంవత్సరాల ఎఫ్‌డీలపై ఏ బ్యాంకు ఎంత వడ్డీ ఇస్తోందంటే  ?
స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అత్యధికంగా సీనియర్ సిటిజన్లకు 8.50% వరకు వడ్డీని ఇస్తోంది. అంతేకాకుండా ఇతర స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఇస్తున్న 5 ఏళ్ల ఎఫ్‌డీ వడ్డీ రేట్ల వివరాలు చూస్తే...

*సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వడ్డీ రేటు ఏడాదికి 8.50%
*జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వడ్డీ రేటు ఏడాదికి 8.00%
*ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వడ్డీ రేటు ఏడాదికి 7.70%
*ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వడ్డీ రేటు ఏడాదికి 7.50%
*ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వడ్డీ రేటు ఏడాదికి 7.50%
*AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వడ్డీ రేటు ఏడాదికి 7.25%
*స్లైస్ (Slice) స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వడ్డీ రేటు ఏడాదికి 7.25%


సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక ప్రయోజనం ఏంటంటే సాధారణ కస్టమర్ల కంటే 60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు ఎఫ్‌డీలపై 0.50% వరకు అదనపు వడ్డీ లభిస్తుంది.

దీర్ఘకాలిక పెట్టుబడికి అనుకూలంగా సీనియర్ సిటిజన్లు లేదా సెక్యూరిటీతో కూడిన ఫిక్స్డ్ రాబడి కోరుకునేవారు 5 సంవత్సరాల కాలపరిమితికి ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులను ఎంచుకోవడం మంచి ఆలోచన.

 గమనిక: RBI నిబంధనల ప్రకారం ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులతో పాటు ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో  చేసే డిపాజిట్లకు కూడా DICGC ద్వారా  5 లక్షల వరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ రక్షణ ఉంటుంది.