దేశంలో ప్రధాన మీడియా ప్రతిపక్షాల వార్తలను చూపించడంలేదు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనలకు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ చేస్తున్న నిరసనలకు కవరేజ్ ఇవ్వటం లేదు.. అనే ఆందోళన అవసరం లేకుండా లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఒక కొత్త వేదికను ప్రారంభించారు. 2026 అక్టోబర్ 3న సత్యాగ్రహ అనే వెబ్ సైట్ ప్రారంభించారు.
ఈ వెబ్ సైట్ కు సంబంధించిన వివరాలతో కూడిన వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేశారు. దేశంలో నిజం అణచివేతకు గురవుతోంది అంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకుని ఈ వెబ్ సైట్ తీసుకొచ్చినట్లు రాహుల్ చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రజా సమస్యలను గుర్తించేందుకు డిజిటల్ వేదికగా ఈ సత్యాగ్రహ వెబ్ సైట్ రూపొందించినట్లు తెలిపారు.
దేశవ్యాప్తంగా ప్రజలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు, చాలావరకు ఒంటరిగానే పోరాడుతున్నారు. జెన్ జెడ్, విద్యార్థులు, రైతులు, గిరిజనులు, దళితులు, మహిళలు — ప్రతి పోరాటానికీ దానికంటూ ఒక కథ ఉంది. కానీ ఒంటరిగా వినిపించే స్వరం తరచుగా అణచివేతకు గురవుతోంది. ఈ స్వరాలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకురావడానికే సత్యాగ్రహ డిజిటల్ వేదిక. సత్యమే గొప్ప ఆయుధం అని బాపు మనకు ఇది బోధించారు.. సత్యంతో ఐక్యంగా కలిసి నిలబడటమే అంతకంటే గొప్ప ఆయుధం. మీరు కూడా ఏదైనా అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతుంటే, మీ కథను పంచుకోండి. దానికి రెండు నిమిషాలుచాలు.. అంటూ పేర్కొన్నారు.
మీ కథ మ్యాప్ లో కనిపిస్తుంది. మీలాగే ఇంకెవరు పోరాడుతున్నారో మీరు చూడవచ్చు. ప్రతిపక్ష నాయకుడిగా, పార్లమెంటులో, వీధుల్లో, లేఖలు రాయడం ద్వారా, అవసరమైన చోటల్లా మీకు అండగా నిలబడటం ద్వారా నేను చేయగలిగినదంతా చేస్తాను.. ఇది నా బాధ్యత,అని అన్నారు.
అయితే ఇలాంటి నిరసనలు, ఆందోళనలకు సంబంధించిన వివరాలు అందుబాటులో ఉండేలా.. వారికి మద్ధతుగా ఉండేలా సత్యాగ్రహ అనే వెబ్ సైట్ తీసుకొచ్చినట్లు రాహుల్ గాంధీ చెప్పారు. మీ సమస్యలను వెబ్ సైట్ లో అప్ లోడ్ చేస్తే వాటిని చూసి మద్ధతు ఇస్తామని తెలిపారు. అవసరం అనుకుంటే పార్టీ కూడా ఆందోళనల్లో పాల్గొంటుందనంటూ ట్వీట్ చేశారు.
దేశంలోని ప్రతి మూలనా నిరసనలు జరుగుతున్నాయి. కొందరు విద్యార్థుల గురించి, కొందరు మహిళల గురించి, ఇంకొందరు ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. ఇలా దేశవ్యాప్తంగా లక్షలాది నిరసనలు జరుగుతున్నాయి. నేను ప్రతిపక్ష నాయకుడిని, ఈ నిరసనలన్నింటి సమాచారాన్ని ఒకేచోటికి తీసుకురావాలని భావిస్తున్నాను. అందుకే మీ కోసం సత్యాగ్రహ వెబ్‌సైట్‌ను ప్రారంభించాము. మీ నిరసన చిన్నదైనా, పెద్దదైనా, మీ పేరు, మీ కార్యకర్తల పేర్లను నమోదు చేయండి. అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.
వీడియోలు ఎలా అప్లోడ్ చేయాలి..?
సత్యాగ్రహ వెబ్ సైట్ ఓపెన్ చేసి.. ఫామ్ ఫిల్ చేసి.. నిరసన, ఆందోళన, ఉద్యమం ఏదైనా వీడియో అప్లోడ్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా రాహుల్ గాంధీ సూచించారు. ఆ వీడియోను చూసి.. తమ వైపు నుంచి ఎలాంటి మద్ధతు కావాలో చేస్తామని చెప్పారు. న్యాయాన్ని కాపాడేందుకు మేము మీతో ఉంటాం.. అంటూ రాహుల్ ట్వీట్ చేశారు.
వెబ్ సైట్ లింక్:
Truth is being suppressed across the country.
— Telangana Congress (@INCTelangana) October 3, 2026
From protests over land and women’s rights to the fight for Dalit and OBC rights, education and examinations, people across India are raising their voices and standing up for what is right.
To bring these protests together, connect… pic.twitter.com/ScjW8Y9HMP
