AI ఇచ్చిన ఫొటోతో దొరికేశాడు : 22 ఏళ్ల తర్వాత హత్య కేసుల్లో నిందితుడు పట్టివేత

AI ఇచ్చిన ఫొటోతో దొరికేశాడు : 22 ఏళ్ల తర్వాత హత్య కేసుల్లో నిందితుడు పట్టివేత

అతని పేరు రాకేష్.. కేరళ రాష్ట్రం.. మూడు హత్య కేసుల్లో నిందితుడు. జైలుకు వెళ్లాడు. బెయిల్ పై బయటకు వచ్చాడు. అప్పటి నుంచి పరారీ.. కొన్నాళ్లుగా వెతికిన పోలీసులు.. ఆచూకీ దొరక్క వదిలేశారు. ఎందుకో మరి పోలీసులకు ఓ ఐడియా వచ్చింది. రాకేష్ పాత ఫొటోను.. AI ద్వారా మార్చి చూస్తే ఏమైనా ఫలితం ఉంటుందా అని ఆలోచించారు.

అనుకున్నదే తడవుగా 22 ఏళ్ల క్రితం నాటి రాకేష్ ఫొటోను.. AI ద్వారా ఇప్పుడు ఎలా ఉంటాడో సృష్టించారు. అంతే.. ఫొటో బాగా వచ్చింది. ఆ ఫొటో ఎంక్వయిరీ మొదలుపెట్టగా.. కర్నాకట రాష్ట్రంలో ఉన్నట్లు గుర్తించారు. అతను రాగేష్ నా కాదా అని నిఘా పెట్టారు.. దొరికేశాడు.. వాడే రాగేష్ అని క్లారిటీకి వచ్చి.. అరెస్ట్ చేసి కేరళకు తీసుకొచ్చి.. కోర్టులో హాజరుపరిచి.. జైలుకు పంపించారు. AI.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత పని చేసింది అంటూ బోరుబోరు మంటున్నాడు రాగేష్.. ఈ మొత్తం వ్యవహారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కన్నూర్ జిల్లా తవక్కర ప్రాంతానికి చెందిన రాగేష్ ను 2026 ఆగస్టు 16 అర్థరాత్రి అరెస్టు చేసినట్లు కన్నూర్ సీపీ విజయ్ భరత్ రెడ్డి తెలిపారు. కర్ణాటకలోని తరబనహల్లిలో దాగి ఉండగా పట్టుకున్నారు. బెంగళూరులో పనిచేస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు ఏఐ సాయంతో ఫోటో ద్వారా సర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టి.. ఎట్టకేలకు పట్టుకున్నారు. 

సినీ నటుడు కావాలని..

హత్య కేసులో నిందితుడైన రాగేష్.. పోలీసుల కళ్లుగప్పేందుకు భలే ప్లాన్ వేశాడు. తను సినీ నటుడు కావాలని అనుకుంటున్నానని.. అందుకే ఇంట్లో ఉన్న అన్ని ఫోటోలు పంపాల్సిందిగా చెప్పి.. ప్పట్లో తెప్పించుకున్నాడు. 20 ఏళ్ల క్రితం కదా.. ఫోటో కడిగారంటే ఇక అంతే.. మళ్లీ ఆ ఫ్రేమ్ ఉంటేనే ఫోటో. దాదాపు ఒకసారి ఫోటో కడిగితే ఆ రీల్ ఫ్రేమ్ తో అవసరం రాదు. అందుకే ఫోటోలు తెప్పించుకుని తను ఎలాఉంటాడో తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. పోలీసులు తనను ట్రేస్ చేయకుండా ప్లాన్ చేశాడు. 

స్నేహితుడి ద్వారా ఆచూకి...

అయితే రాగేష్ ఫ్రెండ్ చెప్పిన క్లూతో పోలీసులు ఈజీగా పట్టుకోగలిగారు. బెంగళూరులోని మళయాలి నిర్వహిస్తున్న హోటల్ లో క్యాటరింగ్ చేస్తున్నట్లు అతని స్నేహితుడు చెప్పాడు. వెంటనే అక్కడ నిఘా పెట్టారు పోలీసులు. ఫోన్ కాల్స్ ట్రేస్ చేసిన పోలీసులు.. రాగేష్ రెంటెడ్ హౌస్ లో ఉంటున్నట్లు నిర్ధారించుకున్నారు. ఆ ఇంటిపై రైడ్స్ నిర్వహించి పట్టుకున్నారు. 

►ALSO READ | బ్యాంకు అకౌంట్లు రెంటుకు ఇస్తున్నరా..? మీకూ వీళ్ల గతే పడ్తది జాగ్రత్త!

22 ఏళ్లుగా మారు పేరుతో.. 

రాగేష్ త్రిస్సూర్ లో 22 ఏళ్లుగా మారుపేరుతో నివసిస్తున్నాడు. ఒక మహిళను పెళ్లి చేసుకుని.. సాబు అనే పేరుతో గుర్తింపు కార్డులు సంపాదించి అక్కడే ఉంటున్నాడు. అయితే అక్కడున్న స్థానికులకు అతని గతం తెలియకపోవడంతో ఎప్పుడూ పెద్ద సమస్య కాలేదు.

అయితే రాగేష్ బైక్ నెంబర్ ద్వారా సాబూ అనే వ్యక్తి రాగేషేనని నిర్ధారించుకున్నారు. ఆర్సీ ద్వారా ఫోన్ నెంబర్ సంపాదించారు. 

2001 మర్డర్ కేసులో నిందితుడు..

రాగేష్ 2001 మర్డర్ కేసులో నిందితుడు. కొంబ్రా ప్రదీపన్ అనే వ్యక్తి హత్య అప్పట్లో కన్నూర్ లో సంచలనం సృష్టించింది. అదే విధంగా 2004లో కన్నూర్ సెంట్రల్ జైల్లో రవీంద్రన్ అనే వ్యక్తి హత్యలో కూడా నిందితుడు. అదే విధంగా తన స్నేహితుడు యోగానందన్ పై కూడా హత్యా యత్నం చేసినట్లు ఆరోపణలున్నాయి. 

బెయిల్ పై వచ్చిన రాగేష్.. దాదాపు 20 ఏళ్లుగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్నాడు. అరెస్టు చేసిన పోలీసులు కన్నూర్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరిచి కస్టడీకి పంపించారు.