బ్యాంకు అకౌంట్లు రెంటుకు ఇస్తున్నరా..? మీకూ వీళ్ల గతే పడ్తది జాగ్రత్త!

బ్యాంకు అకౌంట్లు రెంటుకు ఇస్తున్నరా..? మీకూ వీళ్ల గతే పడ్తది జాగ్రత్త!

ఒక్క ట్రాన్జాక్షన్ కు మూడు వేల రూపాయలు ఇస్తాం.. లేదంటే ఐదు ఇస్తాం.. నీకు  సైడ్ ఇన్ కమ్ వస్తుంది.. వాళ్లు డబ్బులు మన అకౌంట్ కు వేస్తారు.. మనం వేరే వాళ్లకు పంపాలి.. అంటే టెంప్ట్ అయ్యి అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చే వాళ్లకు ఇది స్ట్రాంగ్ వార్నింగ్. కమిషన్ వస్తుందని అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చి ఇల్లీగల్ మనీ ట్రాన్స్ఫర్ కు సహకరిస్తే అది అకౌంట్ రెంటుకు ఇచ్చినట్లే. అలాంటి వాళ్లకు ఊహించని శిక్షలు వేస్తున్నారు పోలీసులు. 

పాట్నాలో కమిషన్ కోసం అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చి కొంత లాభం పొందిన వారిపై పోలీసులు చర్యలు ప్రారంభించారు. సైబర్ క్రైమ్స్ కు పాల్పడుతున్న ఫ్రాడ్స్ కు సహకరించినందుకు 2026 ఆగస్టు 17వ తేదీన ముగ్గురిని అరెస్టు చేశారు. 

ప్రభాకర్, అమిత్, దీపక్ అనే నిందితులు.. ఒక్కో లావదేవికి (ట్రాన్జాక్షన్) 3 నుంచి 5 వేల రూపాయలు లబ్ది పొందారు. ఈ ముగ్గురి అకౌంట్ నుంచి దాదాపు 25 కోట్ల రూపాయల లావాదేవీలు జరగటంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. 

ఈ ముగ్గురిలో ఇద్దరు ర్యాపిడో బైక్-ట్యా్క్సీ రైడర్స్ గా పనిచేస్తుండగా.. మూడో వ్యక్తి సైబర్ ఫ్రాడ్ నెట్వర్క్ కు బ్యాంకు అకౌంట్లు ఇప్పించడం చేస్తుంటాడు. వీళ్ల అకౌంట్లు అంతర్రాష్ట్ర సైబర్ క్రిమినల్స్ తో లింక్ అయ్యి ఉన్నట్లు పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు. 

వివిధ రాష్ట్రాలలో ఉన్న బాధితులు సైబర్ క్రైమ్ పోర్టల్ లో ఫిర్యాదు చేయగా.. నిందితులపై కేసు నమోదు చేసినట్లు పాట్నా సైబర్ క్రైమ్ ఇంఛార్జీ, డీఎస్పీ సంగీత కుమారి చెప్పారు. పాట్నాకు చెందిన ఇద్దరితో పాటు బీహార్ కు చెందిన మరో నిందితుడిని అరెస్టు చేసినట్లు ఆమె తెలిపారు. 

ఈ ముగ్గురి వివరాల ఆధారంగా దీని వెనుక ఉన్న నెట్ వ ర్క్ ను ఛేదించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.