మీరు ఇంట్లోనే బీపీ చెక్ చేసుకుంటున్నారా..డాక్టర్లు చెబుతున్న తప్పనిసరి జాగ్రత్తలు

మీరు ఇంట్లోనే బీపీ చెక్ చేసుకుంటున్నారా..డాక్టర్లు చెబుతున్న తప్పనిసరి జాగ్రత్తలు

మీకు బీపీ ఉందా..? బీపీ ఉంటే సాధారణంగా డాక్టర్ల దగ్గరకు వెళ్లి చెకప్ చేయించుకుంటాం.కొందరు ఇంట్లో బీపీ చెకప్ మిషన్లు తెచ్చుకొని చెక్ చేసుకుంటారు. అయితే బీపీని కొలవడం మాత్రమే కాదు.. సరైన పద్ధతిలో కొలవడం కూడా చాలా ముఖ్యం. కొన్ని జాగ్రత్తలు తీసుకోకుంటే సరైన రిపోర్టు రాకపోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. బీపీ మిషన్ వాడే విధానం, ఏ సమయాల్లో బీపీ చెకప్ చేసుకుంటే సరైన, ఖచ్చితమైన రిపోర్టును పొందవచ్చంటున్నారు. అవేంటో తెలుసుకుందాం.    

అధిక రక్తపోటు(బ్లడ్ ఫ్రెజర్) ఇప్పుడు ప్రతి ఒక్కరి విస్తరిస్తున్న ఆరోగ్య సమస్య. ప్రపంచ వ్యాప్తంగా మరణాలకు ఇదిఓ ముఖ్య కారణం కూడా. గుండెజబ్బులు, పక్షవాతంతో  సంభవించే మరణాలలో దాదాపు సగం అధిక రక్తపోటు వల్లే  అని  వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ లెక్కలు చెబుతున్నాయి. మన దేశంలో ప్రతి యేటా 16 లక్షల మరణాలకు అధిక రక్తపోటు కారణమవుతున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్నది. సీజనల్, అంటువ్యాధుల తర్వాత అధిక మరణాలకు కారణం హై బ్లడ్ ప్రెజర్ అని రిపోర్టులు చెబుతున్నాయి.   

ఢిల్లీలోని ఎయిమ్స్ లో న్యూరాలజిస్ట్, జనరల్ ఫిజిషియన్,డాక్టర్ ప్రియాంకసెహ్రావత్.. ఇంట్లోనే బీపీ చెక్ చేసుకునే వారికి కొన్ని చిట్కాలు, జాగ్రత్తలు చెప్పారు. అవి పాటిస్తే ఖచ్చితమైన ఫలితాలు పొందవచ్చంటున్నారు ఆమె.  కాబట్టి మీరు ఇంట్లోనే బీపీని చెక్ చేసుకునే ముందు ప్రాథమికంగా పాటించాల్సిన కొన్ని విషయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. 

బీపీని లెక్కగట్టేందుకు కేవలం కొన్ని నిమిషాలు చాలు.. కానీ దానికి ముందు ఆ సమయంలో మీరు చేసే చిన్న చిన్న పనులు చాలాముఖ్యం. 
 

బీపీ చెకింగ్ కు ముందు ఈ పనులు చేయొద్దు.. 

  • వ్యాయామం
  • నడక తర్వాత, 
  • భోజనం తర్వాత 
  • టీ, లేదా కెఫిన్ , కాఫీ తాగిన తర్వాత 
  • పొగ, మద్యం సేవించిన తర్వాత 

ఎట్టి పరిస్థితుల్లో బీపీ చెక్ చేయొద్దు. కనీసం 30 నిమిషాలు ఆగి  బీపీ కొలిస్తే మంచి రిపోర్టు వస్తుందని డాక్టర్ ప్రియాంక చెబుతున్నారు. 

బీపీ మిషన్ వాడే విధానం.. 

ఒక్క మాటలో చెప్పాలంటే బీపీ మెషిన్ వాడే విధానం చాలా ముఖ్యం అంటున్నారు డాక్టర్. ఖచ్చితమైన బీపీ రీడింగ్ రావాలంటే ఈ విషయాలు గుర్తు పెట్టుకోవాలి. 

ఎడమ చేతికి బీపీ మెషీన్ పట్టి (కఫ్).. 

బీపీ మెషిన్ పట్టి(కఫ్)ను ఎడమచేతికి కట్టుకుంటే బెస్ట్ రీడింగ్ వస్తుందంటున్నారు డాక్టర్ ప్రియాంక. ఒకసారి మాత్రమే రీడింగ్ తీయకుండా.. మూడు సార్లు రీడింగ్ కొలిచా వాటి సగటును రిపోర్టుగా లెక్కించాలి. అలా చేయడంతో మీ బ్లడ్ ప్రెజర్ మరింత ఖచ్చితంగా అంచనా వేయొచ్చంటున్నారు. 

మరో ముఖ్య విషయం ఏంటంటే.. బీపీ మెషిన్ పట్టిని మీ గుండె స్థాయికి సమానంగా ఉంచాలంటున్నారు. న్యూరాలజిస్ట్ ప్రకారం, మీరు కూర్చున్నా లేదా పడుకున్నా అది మీ గుండెకు సమాంతరంగా ఉండాంటున్నారు. 

బీపీ మెషిన్ పట్టి కట్టే విధానం.. 

బీపీ మిషన్ పట్టీని (కఫ్) మీ చేతికి కట్టే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు డాక్టర్. బీపీ మిషన్ పట్టీని (కఫ్) మీ చేతికి మరీ గట్టిగా కాకుండా, కొంచెం వదులుగా చుట్టాలి. ఎంతలా అంటే చేతికి కట్టిన పట్టిలో రెండు వేళ్లు పట్టేంత వదులుగా ఉంచాలంటున్నారు. 

బీపీని కొలవడం మాత్రమే కాదు.. సరైన పద్ధతిలో కొలవడం కూడా చాలా ముఖ్యం. ప్రశాంతంగా కూర్చొని రీడింగ్ తీసుకోవడం, ఒకసారి వచ్చిన రీడింగ్‌ ఆధారంగా నిర్ణయానికి రాకుండా మూడు రీడింగ్స్‌ తీసుకుని సగటును లెక్కించడం ద్వారా చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఇంట్లోనే బీపీని మరింత ఖచ్చితంగా చెక్ చేసుకోవచ్చు.  తరచూ బీపీ ఎక్కువగా వస్తే మాత్రం వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం తప్పనిసరి.