హైదరాబాద్ యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలో భారీ చోరీ.. 30 లక్షలు దోచుకెళ్లిన దొంగలు

హైదరాబాద్ యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలో భారీ చోరీ.. 30 లక్షలు దోచుకెళ్లిన దొంగలు

హైదరాబాద్: శంషాబాద్ సాతం రాయి ATMలో చోరీ జరిగింది. ఏటీఎంను చోరీ చేసిన దుండగులు 30 లక్షలకు పైగా డబ్బు దోచుకెళ్లారు. శంషాబాద్ GHMC పరిధిలోని సాతం రాయి వద్ద యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో భారీ చోరీ జరిగింది. అర్ధరాత్రి ఏటీఎంలోకి చొరబడిన గుర్తుతెలియని దుండగులు ఏటీఎం మిషన్‌ను ధ్వంసం చేశారు.

ఏటీఎం మిషన్‌లోని 30 లక్షలకు పైగా నగదు దొంగలించినట్టు ప్రాథమిక సమాచారం. విషయం తెలుసుకున్న బ్యాంకు అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న శంషాబాద్ పోలీసులు, క్లూస్ టీమ్ ఆధారాలను సేకరిస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దుండగుల కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.