బాలికకు లైంగిక వేధింపులు  హాస్పిటల్ఎండీ అరెస్ట్

బాలికకు లైంగిక వేధింపులు  హాస్పిటల్ఎండీ అరెస్ట్

నేరేడ్‌‌మెట్, వెలుగు : బాలికపై లైంగిక దాడి చేశాడనే ఆరోపణలతో నేరేడ్‌‌మెట్ పోలీసులు ఓ ప్రైవేట్ హాస్పిటల్​ ఎండీని అరెస్ట్​ చేశారు. నేరేడ్‌‌మెట్‌‌లోని సంతోషిమా నగర్‌‌లో శ్రీ సాయి శ్రీనివాస మల్టీస్పెషాలిటీ దవాఖానలో ట్రైనీ నర్సుగా చేరిన బాలికను హాస్పిటల్​ఎండీ ధారావత్ తార్యా నాయక్ (50) పలుమార్లు లైంగికంగా వేధించాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో  పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు పెట్టి అరెస్ట్​ చేశారు.