హైదరాబాద్, వెలుగు: ఖైరతాబాద్ అసెంబ్లీకి 2023లో జరిగిన ఎన్నికల్లో తనకు న్యాయం జరగాలనే కేసు వేశానని కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన విజయారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్ లో మీడియాతో ఆమె మాట్లాడారు. ఖైరతాబాద్ కు ఉప ఎన్నిక రాకుండా తాను కేసు వేశానని వస్తున్న ఆరోపణలను ఆమె ఖండించారు. దీనిపై కొందరు సీనియర్ నేతలు చేస్తున్న కామెంట్లపై తాను స్పందించలేనని, కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు దాని గురించి తానేమీ మాట్లాడలేనని అన్నారు. ఆ కేసు పాతదేనని, కోర్టులో ఉన్న కేసు వల్ల ఖైరతాబాద్ కు ఉప ఎన్నిక జరపలేమని ఈసీ హైకోర్టుకు తెలిపిందన్నారు.
