నాంపల్లిలో ఉద్రిక్తత.. అబ్కారీ భవన్‌ను ముట్టడించిన బార్‌ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్

నాంపల్లిలో ఉద్రిక్తత.. అబ్కారీ భవన్‌ను ముట్టడించిన బార్‌ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్

హైదరాబాద్: నాంపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. నాంపల్లిలోని అబ్కారీ భవన్‌ను బార్‌ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ ముట్టడించారు. అబ్కారీ కార్యాలయంలోకి వెళ్లేందుకు బార్‌ అసోసియేషన్ నేతలు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను గేట్ దగ్గరే అడ్డుకున్నారు. దీంతో అబ్కారీ కార్యాలయం బయటే ఆందోళన చేస్తున్నారు. 

ప్రభుత్వం కొత్తగా విధిస్తున్న ప్రివిలేజ్ ట్యాక్స్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కొత్త ప్రివిలేజ్ ట్యాక్స్‌ విధానంతో తమపై 8 నుంచి 16 శాతం వరకు అదనపు పన్ను భారం పడుతోందన్న బార్‌ యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పన్నులు, లైసెన్స్ ఫీజులతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తున్నాయని.. ప్రివిలేజ్ ట్యాక్స్‌తో బార్‌ వ్యాపారం మరింత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. 

అదనపు భారాన్ని కస్టమర్లపై ధరల పెంపుతో మోపాల్సి వస్తుందని హెచ్చరించారు. ధరలు పెరిగితే అక్రమ పర్మిట్ రూమ్‌లకు కస్టమర్లు వెళ్లే ప్రమాదం ఉందన్నారు. బార్‌లు ఉన్న ప్రాంతాల్లో బెల్ట్‌ షాపులు తొలగించాలని డిమాండ్ చేశారు. అక్రమ పర్మిట్ రూమ్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.