బుధవారం కుప్పకూలిన గోల్డ్.. కేజీకి రూ.5వేలు తగ్గిన వెండి రేటు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లివే!

బుధవారం కుప్పకూలిన గోల్డ్.. కేజీకి రూ.5వేలు తగ్గిన వెండి రేటు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లివే!

గత 10 రోజులుగా తగ్గటం అనే మాటే లేకుండా పైపైకి పోతున్న బంగారం ధరలకు బుధవారం బ్రేక్ పడింది. ఇదే సమయంలో స్థిరంగా కొనసాగుతున్న వెండి ధరలు కూడా నేలకు దిగివచ్చాయి. దీంతో శ్రావణమాసం శుభకార్యాల కోసం షాపింగ్ చేయాలనుకుంటున్న ప్రజలకు బిగ్ రిలీఫ్ దొరికింది. తెలుగు రాష్ట్రాల ప్రజలు రిటైల్ షాపులకు వెళ్లే ముందు తమ నగరంలో తగ్గిన ధరలను పరిశీలించటం మంచిది. 

ఆగస్టు 19న బంగారం రేట్లు తగ్గాయి. ఆగస్టు 18 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా రూ.92 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 497గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 205గా కొనసాగుతోంది. 

బుధవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. ఆగస్టు 19, 2026న దేశవ్యాప్తంగా రేటు కేజీకి రూ.5వేలు తగ్గింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.5వేలు తగ్గి రూ.2లక్షల 50వేలుగా ఉంది. అంటే గ్రాము దాదాపు రూ.250 దగ్గర అమ్మకాలు జరుగుతున్నాయి.