హైదరాబాద్, వెలుగు: ప్రీమియం విండోస్, ఫసాడ్స్, స్మార్ట్ బిల్డింగ్ సొల్యూషన్స్ అందించే హైదరాబాద్కంపెనీ యాక్టివ్ గ్రీన్ ప్రొడక్ట్స్ వచ్చే 18 నెలలలో 15 ఫ్రాంచైజీ ఔట్లెట్లను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ, గోవాలలో తన ఉనికిని బలోపేతం చేయనుంది.
జర్మనీ, బెల్జియం, మలేషియా దేశాల గ్లోబల్ కంపెనీలతో టెక్నాలజీ భాగస్వామ్యాలతో ప్రొడక్టులు తయారు చేస్తున్నామని ఎండీ వెంకట సుబ్బరాజు తెలిపారు. బెంగళూరులో కొత్త షోరూమ్‌ను ఏర్పాటు చేయడంతో పాటు కర్ణాటకలో కొత్త యూనిట్ ప్రారంభానికి సిద్ధమవుతోందని వెల్లడించారు.
తెలంగాణలోని సుల్తాన్‌పూర్, పాశమైలారం యూనిట్ల ద్వారా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటూ రాబోయే కాలంలో రూ.1,000 కోట్ల వ్యాపార లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని రాజు వివరించారు.
