న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభం, ఎల్ నినో ప్రభావం కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ జీడీపీ వృద్ధి రేటు 6.8 శాతానికి పరిమితం కానుందని రేటింగ్ఏజెన్సీ ఇండ్- రా అంచనా వేసింది. గత సంవత్సరంలో ఇది 7.6 శాతం ఉంది. దీని రిపోర్ట్ప్రకారం.. ఇటీవల ఆర్‌బీఐ తన వృద్ధి అంచనాలను 6.7 శాతానికి సవరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో క్రూడాయిల్ ధర సగటున 85 డాలర్ల వరకు ఉండొచ్చు.
రూపాయి మారకం విలువ సగటున రూ. 93.98 వద్ద బలహీనపడనుంది. ఎఫ్‌సీఎన్‌ఆర్, ఈసీబీ మార్గాల ద్వారా 70 బిలియన్ డాలర్లు వచ్చే అవకాశం ఉంది. ఇంధన ధరల భారం, ఆహార ద్రవ్యోల్బణం, రూపాయి తగ్గుదల వల్ల వృద్ధి మందగిస్తోంది. రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 4.9 శాతం వరకు ఉండవచ్చు. కరెంట్ అకౌంట్ లోటు జీడీపీలో 1.5 శాతానికి పెరిగే అవకాశం ఉంది.
గతేడాది ఇది 0.6 శాతంగా ఉండేది. ఎల్ నినో కారణంగా సాగుపై తీవ్ర ప్రభావం ఉంటుంది. సబ్సిడీల భారం కారణంగా ఆర్థిక లోటు లక్ష్యం 4.3 శాతాన్ని సాధించడం కష్టమేనని ఇండ్రా పేర్కొంది.
