ట్రైనీ డిప్యూటీ తహసీల్దార్ ఆత్మహత్య

ట్రైనీ డిప్యూటీ తహసీల్దార్ ఆత్మహత్య

మహబూబాబాద్, వెలుగు: ఫ్యాన్​కు ఉరేసుకొని ట్రైనీ డిప్యూటీ తహసీల్దార్  ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్  పట్టణానికి చెందిన డోలి వెంకటేశ్వర్లు, పద్మ దంపతుల చిన్న కూతురు డోలి సంధ్య(28) ఖమ్మం జిల్లాలో ట్రైనీ డిప్యూటీ తహసీల్దార్ గా ఉద్యోగం చేస్తోంది. సోమవారం సాయంత్రం తల్లిదండ్రులు బయటకు వెళ్లి, ఇంటికి తిరిగి వచ్చే సరికి సంధ్య ఇంట్లోని ఫ్యాన్ కు ఉరేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.

 మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్​ సీఐ రఘుపతి రెడ్డి తెలిపారు. విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. గ్రూప్–2లో మంచి ర్యాంక్​ సాధించి ఉద్యోగం దక్కించుకున్న కూతురు చనిపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా, సంధ్య ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని స్థానికులు చర్చించుకుంటున్నారు.