నోయిడాలోని సెక్టార్ 94లో ఉన్న 'సూపర్‌నోవా' అనే ఒక లగ్జరీ బిల్డింగ్ లో ఘోరమైన ఘటన జరిగింది. శనివారం రోజున 35 ఏళ్ల ఒక వ్యక్తి ఆ బిల్డింగ్ 43వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అంత ఎత్తుపై నుంచి కింద పడటంతో అతడి శరీరం తీవ్రంగా దెబ్బతిని, రెండు ముక్కలుగా విడిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
సమాచారం ప్రకారం.. అతను హర్యానాలోని మనేసర్‌కు చెందిన సంభవ్ జైన్ (35) అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. సంభవ్ జైన్ ఆ భవనంలోని ఒక ఎయిర్‌బిఎన్‌బి (Airbnb) రూం ఆన్‌లైన్ ద్వారా ఒక రోజు కోసం బుక్ చేసుకున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒంటరిగా వచ్చి రూమ్‌లోకి వెళ్లాడు.
ఈ ఘటన జరగడానికి ముందు పక్క ఫ్లాట్‌లో ఏసీ రిపేర్ చేస్తున్న ఒక టీమ్, సంభవ్ జైన్ బాల్కనీ రెయిలింగ్ నుండి దూకేందుకు ప్రయాణిస్తుండటం గమనించింది. అతడిని కాపాడేందుకు వారు ప్రయత్నించిన ఫలితం లేకుండాపోయింది. అప్పటికే అతడు 43వ అంతస్తు నుంచి కిందకు దూకేశాడు.
కింద ఉన్న కొందరు వ్యక్తులు అతను బాల్కనీ అంచున నిలబడటం చూసి, కంగారుపడుతూ సెక్యూరిటీకి సమాచారం ఇచ్చారు. ఈ దృశ్యాలను కొందరు ఫోన్లలో కూడా రికార్డ్ చేశారు.
పోలీసుల విచారణ
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు అక్కడకు చేరుకున్నాయి. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టంకు తరలించారు. బిల్డింగ్ లోని CCTV ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ప్రాథమిక విచారణ ప్రకారం.. సంభవ్ జైన్ చాల ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిసింది.
ఈ ఘటనకు నాలుగు రోజుల ముందు నుంచే అతను ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. చివరగా అతను తన తండ్రితో చేసిన చాటింగ్ లభించింది. అక్కడ ఉన్నవారు తెలిపిన వివరాల ప్రకారం అతను చాల మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా... ఆత్మహత్యకు పూర్తి కారణాలు తెలుసుకోవడానికి విచారణ కొనసాగిస్తున్నారు.
#नोएडा : सेक्टर-126 थाना क्षेत्र के सेक्टर-94 स्थित सुपरनोवा बिल्डिंग की 42वें फ्लोर से कूदकर एक युवक ने की आत्महत्या।
— The Lucknow Times (@thelucknowtimes) October 3, 2026
👉 जानकारी के अनुसार बगल मे काम कर रहे AC मेकेनिक बचाने की कोशिश की लेकिन असफल रहा। pic.twitter.com/k6csh4udIM
