‘వెలుగు’ సిద్దిపేట ఫొటోగ్రాఫర్ కు.. కన్సొలేషన్ ప్రైజ్

‘వెలుగు’ సిద్దిపేట ఫొటోగ్రాఫర్ కు.. కన్సొలేషన్  ప్రైజ్

సిద్దిపేట, వెలుగు: హైదరాబాద్  ప్రెస్ క్లబ్  ఆధ్వర్యంలో 187వ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఉత్తమ వార్త చిత్రం ఫొటోగ్రఫీ పోటీల్లో  వెలుగు సిద్దిపేట ఫొటోగ్రాఫర్  మహిమల భాస్కర్ రెడ్డికి రాష్ట్ర స్థాయి కన్సొలేషన్  ప్రైజ్  దక్కింది. 200 పైగా ఫొటోగ్రాఫర్లు పోటీ పడగా, భాస్కర్ రెడ్డి తీసిన ఫొటోకు ప్రైజ్  వచ్చింది. ఈ నెల 23న సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో  ఈ ప్రైజ్ ను అందుకోనున్నారు. భాస్కర్ రెడ్డికి ప్రైజ్  రావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.