- స్మార్ట్‌ఫోన్లపై డీల్స్ ఇవే..
హైదరాబాద్, వెలుగు: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, యాక్సెసరీస్‌పై భారీ ఆఫర్లు ప్రారంభమయ్యాయి. శామ్‌సంగ్, వన్‌ప్లస్, షావోమీ, రెడ్‌మీ బ్రాండ్లపై తక్కువ ధరలకు అందిస్తున్నామని సంస్థ ప్రకటించింది. అన్ని ఆఫర్లతో కలుపుకుంటే ఐఫోన్16ను రూ.72 వేలకు, శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా 5జీ ఫోన్‌ను రూ.85 వేలకు దక్కించుకోవచ్చు.
గేమింగ్ ఫోన్ ఐకూ 15ఆర్ రూ.46,499, వన్‌ప్లస్ నార్డ్ 6 ఫోన్ రూ.42,999కు అందుబాటులో ఉన్నాయి. ఎస్‌బీఐ కార్డులతో కొంటే 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. ప్రైమ్ సభ్యులు అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా 10 శాతం వరకు అదనంగా పొదుపు చేయవచ్చు. అమెజాన్ ఏఐ అసిస్టెంట్ రూఫస్ ద్వారా కస్టమర్లు ఉత్పత్తులను పోల్చి చూడవచ్చు.
