భారతీయ రియల్ ఎస్టేట్ రంగంలోకి గ్లోబల్ లగ్జరీ బ్రాండ్లు: ల్యూర్ హోల్డింగ్స్, సిరిల్ భాగస్వామ్యం

భారతీయ రియల్ ఎస్టేట్ రంగంలోకి గ్లోబల్ లగ్జరీ బ్రాండ్లు: ల్యూర్ హోల్డింగ్స్, సిరిల్ భాగస్వామ్యం

భారతీయ లగ్జరీ రియల్ ఎస్టేట్ రంగంలో మార్పులు తీసుకొచ్చేందుకు గ్లోబల్ లగ్జరీ అడ్వైజరీ ప్లాట్‌ఫారమ్ 'ల్యూర్ హోల్డింగ్స్', దేశీయ రియల్ ఎస్టేట్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫారమ్ 'సిరిల్'తో చేతులు కలిపింది. దేశవ్యాప్తంగా బ్రాండెడ్, లగ్జరీ రియల్ ఎస్టేట్ అవకాశాలను గుర్తించి అభివృద్ధి చేయడానికి ఈ రెండు సంస్థలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాయి.

ప్రస్తుతం భారత్‌లో పెరుగుతున్న సంపన్న వర్గాలు, మారుతున్న లైఫ్ స్టైల్ కారణంగా లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్ వేగంగా రూపాంతరం చెందుతోంది. కేవలం నాణ్యత, లొకేషన్ మాత్రమే కాకుండా గ్లోబల్ బ్రాండ్ గుర్తింపును కోరుకునే వినియోగదారుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో రెండు సంస్థల మధ్య భాగస్వామ్యం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ సహకారం ద్వారా 300కి పైగా ప్రముఖ ఫ్యాషన్, లైఫ్‌స్టైల్, లగ్జరీ బ్రాండ్‌లతో ల్యూర్ హోల్డింగ్స్‌కు ఉన్న అంతర్జాతీయ నెట్‌వర్క్, సిరిల్ సంస్థకు చెందిన లోకల్ మార్కెట్ ఇంటెలిజెన్స్, డెవలపర్ ఎకోసిస్టమ్ ఒకే వేదికపైకి రానున్నాయి. ప్రపంచ స్థాయి బ్రాండ్లను భారతదేశంలోని అత్యుత్తమ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లతో అనుసంధానించడం ద్వారా విభిన్నమైన, అత్యున్నత విలువ కలిగిన ప్రాపర్టీలను అభివృద్ధి చేయడానికి ఇది దోహదపడుతుంది.

ఈ భాగస్వామ్యం భవిష్యత్తులో భారతీయ ప్రీమియం రియల్ ఎస్టేట్ రంగాన్ని ఊహించని విధంగా గ్రో చేస్తుందని ఇరు సంస్థల ప్రతినిధులు తెలిపారు. అంతర్జాతీయ బ్రాండ్ అనుభవాన్ని స్థానిక మార్కెట్ అవసరాలతో అనుసంధానిస్తూ, ఆధునిక లగ్జరీ వినియోగదారుల అంచనాలకు తగినట్లుగా ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌లను అందించడమే వీరి ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.