ElNiNo ప్రభావం ఉన్నా.. కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కష్టాలు రానివ్వం : మంత్రి పొంగులేటి

ElNiNo ప్రభావం ఉన్నా.. కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కష్టాలు రానివ్వం : మంత్రి పొంగులేటి

నేలకొండపల్లి, వెలుగు: ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నినో ప్రభావంతో ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రజలకు కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కష్టాలు రానివ్వకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కట్టుకాచారంలో రూ.6.65 కోట్లతో పాలేరు వాగుపై నిర్మించిన చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్యామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను శనివారం మంత్రి ప్రారంభించారు. అలాగే వట్టుకుంట వాగు వరకు రూ.2.50 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దివాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో నేలకొండపల్లి మండలానికి చెందిన 31 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెక్కులను పంపిణీ చేశారు. 

అనంతరం పొంగులేటి మాట్లాడుతూ.. ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నినో తాండవిస్తున్నప్పటికీ తాగు, సాగునీటి కొరత రాకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇటీవల వచ్చిన తుఫాను కొంత మేలు చేసిందన్నారు. విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొరత రాకుండా అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి యూనిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.12 చొప్పున కొనుగోలు చేసేందుకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. ప్రత్యామ్నాయంగా సౌర, పవన విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టులపై కూడా దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండల అధ్యక్షుడు కొడాలి గోవిందరావు, మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెన్నపూసల సీతారాములు, మాజీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖమూరి రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నాయకులు నెల్లూరి భద్రయ్య, ఎస్సీ సెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా అధ్యక్షుడు బొందయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇల్లు నిర్మించేందుకు ముందుకొచ్చిన ‘తాన్లా’

సత్తుపల్లి: సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లోని నిరుపేదల కోసం తాన్లా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఉదయ్ కుమార్ రెడ్డి సొంత నిధులతో సుమారు రూ.300 కోట్ల అంచనా వ్యయంతో 5 వేల ఇళ్లను ఉచితంగా నిర్మించి ఇచ్చేందుకు ముందుకు వచ్చారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి తెలిపారు. సత్తుపల్లి మండలం బేతుపల్లి గంగారంలో తాన్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రామీణ ఆరోగ్య కేంద్రం, ల్యాబొరేటరీలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, కలెక్టర్ దివాకర్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సందర్శించారు. తాన్లా ఫౌండేషన్ సేవలు గొప్పవని మంత్రి కొనియాడారు.