ధరణి ఐ లవ్ యు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

 ధరణి ఐ లవ్ యు  ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

వంశీ,  మహిత జంటగా సాయికృష్ణ కేవీ తెరకెక్కించిన చిత్రం ‘ధరణి ఐ లవ్‌‌‌‌‌‌‌‌ యు’.  రాజశేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మద్దికుంట నిర్మించారు.  తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్‌‌‌‌‌‌‌‌ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  నిర్మాత ఎస్‌‌‌‌‌‌‌‌కేఎన్‌‌‌‌‌‌‌‌ లాంచ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆసక్తికరంగా ఉంది.  టైటిల్‌‌‌‌‌‌‌‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.  దర్శకుడికి ఇది రెండో చిత్రం.  రాజమౌళి గారి ‘మగధీర’ చిత్రానికి ఆయన  అసోసియేట్‌‌‌‌‌‌‌‌గా వర్క్ చేశారు.

సినిమా ఘన విజయం సాధించి టీమ్ అందరికీ మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నా’ అని విష్ చేశారు.   అన్నిరకాల కమర్షియల్‌‌‌‌‌‌‌‌ ఎలిమెంట్స్‌‌‌‌‌‌‌‌తో ప్రేక్షకులను అలరించేలా ఈ సినిమా ఉంటుందని, త్వరలోనే ఇతర వివరాలను తెలియజేస్తామని మేకర్స్‌‌‌‌‌‌‌‌ చెప్పారు.  హీరోహీరోయిన్స్‌‌‌‌‌‌‌‌తో పాటు దర్శకుడు సాయికృష్ణ, నిర్మాత రాజశేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రైటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాలసూర్య తదితరులు పాల్గొన్నారు.