ఒకే నెలలో రెండు సినిమాలతో పలకరించబోతున్న సాయి పల్లవి

ఒకే నెలలో రెండు సినిమాలతో పలకరించబోతున్న సాయి పల్లవి

ఆచితూచి సినిమాలను అంగీకరించే సాయిపల్లవి.. త్వరలో రెండు ప్రెస్టేజియస్‌‌‌‌‌‌‌‌ సినిమాలతో ప్రేక్షకులను పలకరించబోతోంది.  అయితే ఆ రెండు సినిమాలు కూడా ఒకే  నెలలో విడుదల అవుతుండటం విశేషం. వివరాల్లోకి వెళితే.. హిందీ చిత్రం ‘రామాయణ’లో సీతాదేవిగా సాయిపల్లవి నటించిన విషయం తెలిసిందే.  రణబీర్ కపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాముడిగా నటించిన ఈ చిత్రానికి నితేష్ తివారీ దర్శకుడు.  

దీపావళి సందర్భంగా నవంబర్ 6న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఇదే నెలలో ఆమె నటించిన తమిళ సినిమా కూడా రాబోతోంది.  ధనుష్‌‌‌‌‌‌‌‌ హీరోగా  ‘అమరన్’ ఫేమ్ రాజ్‌‌‌‌‌‌‌‌కుమార్ పెరియసామి రూపొందించిన  ‘ఓం: చాప్టర్ 1 – ఉదిరం’ నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 20న విడుదల కాబోతోంది.  నిజానికి అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 16నే ఈ చిత్రం రావాల్సి ఉన్నప్పటికీ ‘జైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2’ అదే సమయానికి వస్తుండడంతో రజినీకాంత్‌‌‌‌‌‌‌‌పై రెస్పెక్ట్‌‌‌‌‌‌‌‌తో ధనుష్‌‌‌‌‌‌‌‌ సినిమా రిలీజ్‌‌‌‌‌‌‌‌ డేట్‌‌‌‌‌‌‌‌ను మార్చారు.  

దీంతో ఇప్పుడు రెండు వారాల గ్యాప్‌‌‌‌‌‌‌‌తో సాయిపల్లవి నుంచి రెండు సినిమాలు వస్తున్నాయి. ‘రామాయణం’లో సహనానికి మరోపేరైన సీత పాత్రలో కనిపించనున్న సాయిపల్లవి.. ధనుష్‌‌‌‌‌‌‌‌ సినిమాలో అందుకు పూర్తి భిన్నంగా యాక్షన్‌‌‌‌‌‌‌‌,  ఎమోషన్‌‌‌‌‌‌‌‌ కలగలిసిన క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనిపించనుందట.