మేడ్చల్ లో భారీ అగ్నిప్రమాదం.. రెండు ఫర్నీచర్‌ షాపులు దగ్ధం

మేడ్చల్  లో భారీ అగ్నిప్రమాదం.. రెండు ఫర్నీచర్‌ షాపులు దగ్ధం

మేడ్చల్: మేడ్చల్ చెక్‌పోస్ట్‌ వద్ద రోడ్డు పక్కన ఉన్న రెండు ఫర్నీచర్‌ షాపుల్లో అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో షాపుల్లోని ఫర్నీచర్‌ పూర్తిగా దగ్ధమైంది.

మంటలు తీవ్రంగా ఎగసిపడుతూ పక్కనే ఉన్న మరికొన్ని షాపులకు వ్యాపించాయి. దీంతో పరిసర ప్రాంతంలో దట్టమైన పొగ కమ్ముకుంది. అగ్నిప్రమాదంతో స్థానికులు, వ్యాపారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా అనే వివరాలు తెలియాల్సి ఉంది. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో జరిగిన ఆస్తి నష్టం ఎంతమేరకు ఉందనే వివరాలు కూడా తెలియాల్సి ఉంది.