సంతోష్ రాజా, శ్రేయాస్ సేన్ జంటగా మ్యాక్ దర్శకత్వంలో అఫ్రోజ్ షేక్ నిర్మిస్తున్న చిత్రం ‘మొహబ్బత్’. తాజాగా టీజర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. అతిథులుగా హాజరైన హీరో నవదీప్, దర్శకుడు కరుణ కుమార్ ఈ సినిమా విజయం సాధించాలని కోరుతూ టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. హీరో సంతోష్ మాట్లాడుతూ ‘కడపలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తీసిన మ్యూజికల్ ఎమోషనల్ లవ్‌స్టోరీ ఇది.
అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అని అన్నాడు. ఇది తనకు చాలా స్పెషల్ మూవీ అని శ్రేయాస్ సేన్ చెప్పింది. దర్శకుడు మ్యాక్ మాట్లాడుతూ ‘ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులు కొత్త విషయాన్ని తెలుసుకుంటారు. ఈ లవ్ స్టోరీ ఎక్కడా బోర్ కొట్దదు’ అని చెప్పాడు. ఈ చిత్రం గొప్ప మ్యూజికల్ హిట్ అవుతుందని నిర్మాత అఫ్రోజ్ షేక్ అన్నారు. నటుడు అజయ్ ఘోష్, మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ పాల్గొన్నారు.
