విశ్వక్ సేన్ కల్ట్ షూట్ కంప్లీట్

విశ్వక్ సేన్ కల్ట్ షూట్ కంప్లీట్

విశ్వక్‌‌‌‌‌‌‌‌సేన్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘కల్ట్’.  సందీప్ కాకరాల నిర్మిస్తున్నారు.  భారతదేశపు తొలి అథెంటిక్ స్లాషర్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌ ఇది. తరుణ్ భాస్కర్ డైలాగ్స్‌‌‌‌‌‌‌‌ రాస్తున్నాడు.  శనివారంతో ఈ మూవీ షూటింగ్ పూర్తయింది.  

రామోజీ ఫిల్మ్‌‌‌‌‌‌‌‌సిటీలో  వేసిన భారీ సెట్‌‌‌‌‌‌‌‌లో వందలాది మంది  మోడల్స్‌‌‌‌‌‌‌‌లతో -50 రోజుల పాటు కీలక సన్నివేశాలు  చిత్రీకరించారు. ఈ  సీన్స్ సినిమాకు హైలైట్‌‌‌‌‌‌‌‌గా  నిలుస్తాయని మేకర్స్ తెలియజేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మంచి రెస్పాన్స్ రాగా, సినిమాపై అంచనాలు పెరిగాయి.

గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్,  తారక్ పొన్నప్ప కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు.  భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషలలో రూపొందుతున్న ఈ చిత్రం అక్టోబర్ 30న  ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.