నలుగురు అమాయకులు స్పేస్కు వెళితే..

నలుగురు అమాయకులు స్పేస్కు వెళితే..

దర్శకుడు వేణు ఊడుగుల సమర్పణలో  వస్తున్న చిత్రం ‘చంద్రయాన్’. శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్, లోకేష్, బలగం సత్యనారాయణ లీడ్ రోల్స్‌‌‌‌‌‌‌‌లో శ్రీనాథ్‌‌‌‌‌‌‌‌ చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెరకెక్కించగా  ప్రవీణ్ మొలక నిర్మిస్తున్నారు. అక్టోబర్ 30న సినిమా విడుదల కానుంది.  శనివారం టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.  

ముఖ్యఅతిథిగా హాజరైన జ్యోతిష్యుడు వేణు స్వామి మాట్లాడుతూ ‘కృతిక నక్షత్రయుక్త పౌర్ణమి కార్తీకమాసం రోజున రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది’ అని అన్నారు.  మూవీ ప్రెజెంటర్ వేణు ఊడుగుల మాట్లాడుతూ ‘ఇది రెగ్యులర్ రొటీన్ సినిమా కాదు. ఒక అర్థవంతమైన సినిమా.  అమాయకులైన  నలుగురు యువకులు రాకెట్ తయారు చేసుకుని స్పేస్‌‌‌‌‌‌‌‌లోకి వెళ్లడం ఇంటరెస్టింగ్‌‌‌‌‌‌‌‌గా ఉంటుంది’ అని చెప్పాడు.  

కొత్త వాళ్లమంతా కలిసి చేసిన ఈ చిత్రం ఆడియెన్స్‌‌‌‌‌‌‌‌కు మంచి అనుభూతిని పంచుతుందని నటీనటులు అన్నారు.  కుటుంబమంతా కలిసి ఎంజాయ్ చేసే సినిమా ఇదని,  థియేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నవ్వులు గ్యారెంటీ అని దర్శక నిర్మాతలు అన్నారు.