ముల్లన్‌పూర్: బ్యాటింగ్‌లో కేఎల్ రాహుల్ (129 నాటౌట్), రోహిత్ శర్మ (92) దుమ్మురేపినా.. వెస్టిండీస్‌తో శనివారం జరిగిన ఆఖరిదైన మూడో వన్డేలో ఇండియాకు ఓటమి తప్పలేదు. భారీ లక్ష్య ఛేదనలో కెప్టెన్ షై హోప్ (162 నాటౌట్) అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడటంతో.. విండీస్ 5 వికెట్ల తేడాతో ఇండియాపై గెలిచింది. దాంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో హోమ్ టీమ్ ఆధిక్యాన్ని 2–1కి తగ్గించింది.
టాస్ గెలిచిన ఇండియా 50 ఓవర్లలో 351/7 స్కోరు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (57), నమన్‌ధీర్ (30) రాణించగా, శుభ్‌మన్ గిల్ (1), విరాట్ కోహ్లీ (0) ఫెయిలయ్యారు. సెంచరీ మిస్ చేసుకున్న రోహిత్ (202 ఇన్నింగ్స్) వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 10 వేల రన్స్ చేసిన తొలి ఓపెనర్‌గా సచిన్ (214 ఇన్నింగ్స్) రికార్డును బ్రేక్ చేశాడు.
అలాగే విండీస్‌పై వంద సిక్స్‌లు కొట్టిన తొలి ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు. తర్వాత వెస్టిండీస్ 48.2 ఓవర్లలో 352/5 స్కోరు చేసి నెగ్గింది. హోప్‌కు తోడుగా అమిర్ జాంగూ (67), కీమో పాల్ (44), రూథర్‌ఫోర్డ్ (24) రాణించారు.
