ఆడియన్స్ రెస్పాన్స్తో తెల్లకాగితం టీమ్ హ్యాపీ

ఆడియన్స్ రెస్పాన్స్తో  తెల్లకాగితం టీమ్ హ్యాపీ

హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా రమేష్ బండ్రెడ్డి దర్శకత్వంలో కృష్ణా కొమ్మాలపాటి  నిర్మించిన చిత్రం ‘తెల్లకాగితం’.  అక్టోబర్ 2న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందని టీమ్ తెలియజేసింది. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన ప్రెస్‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌కు హాజరైన నిర్మాత బెక్కెం వేణుగోపాల్.. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంటోందని, అన్ని ప్రాంతాల్లో ప్రేక్షకుల స్పందన పెరుగుతోందని  తెలిపారు.

హర్ష్ రోషన్ మాట్లాడుతూ ‘చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్లు, ఫ్యామిలీస్ కూడా సినిమాను ఆదరించడం చాలా హ్యాపీగా ఉంది. యునానిమస్ హిట్ టాక్‌‌‌‌‌‌‌‌తో దూసుకెళ్తోంది’ అని చెప్పాడు. ఇంత బ్యూటిఫుల్ రెస్పాన్స్ ఎక్స్‌‌‌‌‌‌‌‌పెక్ట్ చేయలేదని, ప్రతి ఒక్కరూ తనను ఓన్ చేసుకున్నారని నక్షత్ర చెప్పింది.  

కుటుంబ ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన ఆనందంగా ఉందని దర్శకుడు రమేష్ బండ్రెడ్డి, నటుడు అజయ్, నటి శ్రావ్య అన్నారు.   ఎలాంటి స్టార్ ఇమేజ్ లేకపోయినా సినిమానే స్టార్‌‌‌‌‌‌‌‌గా ప్రేక్షకుల్లోకి వెళ్తోందని  రచయిత నందు సవరిగాన చెప్పాడు.