మంత్రి వివేక్ ను కలిసిన కొండపాక నాయకులు

మంత్రి వివేక్ ను కలిసిన కొండపాక నాయకులు

కొండపాక, వెలుగు: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామిని సిద్దిపేట జిల్లా కొండపాక మండల కాంగ్రెస్ నాయకులు శనివారం సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని ఆయా గ్రామాల సమస్యలు, ఇందిరమ్మ ఇండ్లు, పలు అభివృద్ధి పనుల కోసం మంత్రిని కోరగా, సానుకూలంగా స్పందించి ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశారు. 

కార్యక్రమంలో మండలాధ్యక్షుడు మంచాల కనక రాములు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బట్ట పరశురాములు, జిల్లా జనరల్ సెక్రెటరీ ప్రణీత్ రెడ్డి, సర్పంచులు కోయడ వెంకటేశ్, మల్లయ్య, పావని, శశిధర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ మల్లేశం, కాంగ్రెస్ నాయకులు సుదర్శన్ తదితరులు 
పాల్గొన్నారు.