చిన్న చింతకుంట, వెలుగు : మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద దేవరకద్ర మున్సిపాలిటీ, మండలాలకు చెందిన రైతులకు వ్యవసాయ అవసరాల కోసం 40 ట్రాన్స్ఫార్మర్లు, ఏబీ స్విచ్ లు, వైర్లు, పోల్స్ ను దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తోందన్నారు.ప్రస్తుతం వర్షాలు అంతంత మాత్రంగానే ఉండటంతో పలువురు రైతులు బోర్లపై ఆధారపడి వ్యవసాయం కొనసాగిస్తున్నారని, ఈ నేపథ్యంలో విద్యుత్‌కు సంబంధించిన సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం నియోజకవర్గానికి 800 ట్రాన్స్‌ఫార్మర్లను మంజూరు చేయగా, ఇందులో దేవరకద్ర మండలానికి మొదటి విడతలో 40 ట్రాన్స్‌ఫార్మర్లను అందజేస్తున్నామని తెలిపారు. మరో పది రోజుల్లో మరో 60 ట్రాన్స్‌ఫార్మర్లను అందజేస్తామని చెప్పారు.
