పాక్ బౌలర్లను పిచ్చకొట్టుడు కొట్టిన భారత బ్యాటర్లు.. దాయాది ముందు భారీ టార్గెట్!

పాక్ బౌలర్లను పిచ్చకొట్టుడు కొట్టిన భారత బ్యాటర్లు.. దాయాది ముందు భారీ టార్గెట్!

జపాన్‌లోని నిస్షిన్ కోరోగి స్పోర్ట్స్ పార్క్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు 2026 పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో భారత జట్టు అదరగొట్టింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరుగుతున్న ఈ తుదిపోరులో టీమిండియా బ్యాటర్లు చెలరేగిపోయారు. పాక్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ఏకంగా 211 పరుగుల భారీ స్కోరు సాధించారు. దీంతో పాకిస్థాన్ ముందు 212 పరుగుల కొండంత లక్ష్యం నిలిచింది.

అభిషేక్ శర్మ, తిలక్ వర్మ వీరవిహారం.. బెంబేలెత్తిన పాక్ బౌలర్లు: 

మ్యాచ్ ప్రారంభం నుంచే భారత ఓపెనర్ అభిషేక్ శర్మ తనదైన శైలిలో దూకుడును ప్రదర్శించాడు. పాక్ బౌలర్లను ఏమాత్రం ఉపేక్షించకుండా సిక్సర్ల వర్షం కురిపిస్తూ కేవలం 20 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. చివరికి 28 బంతుల్లో 61 పరుగులు చేసి అభిషేక్ వెనుదిరిగినా, అప్పటికే పాక్ బౌలర్ల వ్యూహాలు తలకిందులయ్యాయి. మరోవైపు మిడిలార్డర్‌లో వచ్చిన తిలక్ వర్మ కూడా అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. సిక్సర్ల మోత మోగిస్తూ 51 పరుగులు సాధించి జట్టు భారీ స్కోరుకు బాటలు వేశాడు.

చివర్లో దూబే మెరుపులు.. మిడిలార్డర్ సహకారం:

ఇన్నింగ్స్ ఆరంభంలో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (15), వికెట్ కీపర్ సంజు శాంసన్ (2) తక్కువ స్కోరుకే పెవిలియన్‌‌కు చేరి నిరాశపరిచారు. ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ (21), ఇషాన్ కిషన్ (20) క్రీజులో కుదురుకుని బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో పర్వాలేదనిపించారు. ఇక చివర్లో క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే, తిలక్ వర్మ కలిసి పాక్ బౌలర్లకు నరకం చూపించారు. మైదాన నలుమూలల బౌండరీల వర్షం కురిపిస్తూ, చివరి ఓవర్లలో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. మొత్తంగా భారత బ్యాటర్ల సమిష్టి విధ్వంసంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ టార్గెట్‌ను బోర్డుపై ఉంచింది. మరి ఈ భారీ లక్ష్యాన్ని పాకిస్థాన్ ఛేదించగలదా అనేది చూడాల్సి ఉంది. 

టీమిండియాని తిప్పలు పెట్టాలని చూసిన పాక్ బౌలర్లు: 

ఆసియా గేమ్స్ 2026 క్రికెట్ ఫైనల్స్ లో స్వర్ణం కోసం పోటీ పడుతున్న ఈ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 211 పరుగులు చేసింది. అయితే, ఆరంభంలో దూకుడుగా ఆడిన వైభవ్ సూర్యవంశీని తక్కువ పరుగులకే పెవిలియన్ పంపగా, అనంతరం క్రీజులోకి వచ్చిన సంజు శాంసన్ కూడా కేవలం 2 రన్స్ మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత మైదానంలోకి వచ్చిన కెప్టెన్ అయ్యర్, ఇషాన్ కాసేపు నెమ్మదిగా బ్యాటింగ్ చేసేలా, పాక్ బౌలర్ల ఒత్తిడి పెట్టినప్పటికీ, చివర్లో మాత్రం పాక్ బౌలర్ల బౌలింగ్ ని పిచ్చికుక్కల్ని కొట్టినట్లు కొట్టారు తిలక్ వర్మ, శివమ్ దూబే చెలరేగారు.