వికారాబాద్: వికారాబాద్ జిల్లా అనంతగిరి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు సమాచారం.
అనంతగిరి నుంచి తాండూరు వైపు బస్సు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు అదుపుతప్పి రోడ్డుపై నుంచి లోయలోకి దూసుకెళ్లడంతో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసేందుకు ప్రయత్నించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలిస్తున్నారు.
ఈ ఘటనలో ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందినప్పటికీ ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
