కాగజ్ నగర్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. మండల కేంద్రంలోని కంకాలమ్మగుట్ట సమీపంలో పులిని చూసిన యువకులు ఆందోళనకు గురయ్యారు. అలాగే శీర్ష గ్రామ సమీపంలోని చెరువు వద్ద పంట చేనులో పులి అడుగులు కనిపించగా, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. పత్తి చేనులో పెద్దపులి పాద ముద్రలుగా గుర్తించారు. పులి కదలికలపై అటవీశాఖ అధికారులు నిఘా పెట్టి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ తులసీదాస్, బీట్ ఆఫీసర్ శ్రీదేవి కోరారు. ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని, గుంపులుగా వెళ్లాలని సూచించారు.
