బంగారు గనుల్లో పని చేస్తున్నా పేదరికమే వారిది. పసిడి తళుకుల మధ్య పనిచేస్తున్నా మట్టి మరకలే వారికి ఆభరణాలు. పొట్టకూటి కోసం బంగారు గనుల్లో పనిచేసేందుకు వెళ్లిన కూలీలు, మైనర్లు ఆ గనుల్లోనే సమాధి అయ్యారు. ఆఫ్రికాలో బంగారు గనులు కూలి 30 మంది దుర్మరణం పాలవ్వడం ప్రపంచ వ్యాప్తంగా కలచివేసిన విషయం.
సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్ లో 2026 ఆగస్టు 18న జరిగిన ప్రమాదంలో 30 మంది చనిపోయారు. మరికొంత మంది మట్టి దిబ్బల కింద కూరుకుపోయి కొనఊపిరితో సతమతం అవుతున్నారు. అబ్బా ప్రాంతంలో ననా మాంబెరే ప్రిఫెక్చర్ లో.. అంతంత మాత్రమే టెక్నాలజీ వినియోగిస్తూ జరుపుతున్న తవ్వకాల్లో ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదంలో మొత్తం 30 మంది చనిపోయినట్లు ప్రమాదం నుంచి బయట పడిన బాధితుల్లో ఒకరైన ఫ్లోరియన్ గగ్యుండే చెప్పాడు. దిబ్బల్లో కూరుకుపోయిన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపాడు. వారు ప్రాణాలతో ఉంటారన్న ఆశ తమకు లేదని తెలిపాడు.
ది సబ్ ప్రిఫెక్చర్ డిప్యూటీ మేయర్ సౌలేమానే బీ మాట్లాడుతూ... సహాయక బృందాలు, స్థానికులు దాదాపు 30 మృతదేహాలను బయటకు లాగారని.. గాయాలపాలైన మైనర్లకు ట్రీట్ మెంట్ అందిస్తున్నారనితెలిపారు.
ప్రమాద ఘటనలోనుంచి బయటకు వచ్చిన ఫూటేజీ తీవ్ర భయాందోళనకు గురిచేసేలా ఉన్నట్లు తెలిపారు. సహాయం కోసం సంస్థలను అర్జించినట్లు చెప్పారు. కార్మికుల మృతదేహాలను వెలికితీసే సమయంలో ఆర్థనాదాలతో గనులు మారుమోగినట్లు చెప్పారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ప్రభుత్వ ప్రతినిధి ఎవరిస్టే ఎన్గామన తెలిపారు.
సెంట్రల్ ఆఫ్రికాలో ఆర్టిసనల్ మైన్ కూలడం అనేది అక్కడ కామన్ అని.. చిన్న తరహా మైనింగ్ వెలికితీత పనుల్లో వేల కొద్ది కార్మికులు పనిచేస్తారని అక్కడి వారు చెబుతున్నారు. అక్కడ పని చాలా రిస్కుతో కూడుకున్నదని.. కార్మికులకు సరైన రక్షణ ఉండదని తెలిపారు.
