ఉద్యోగానికి వెళ్తున్నాని చెప్పి ప్రియురాలితో సహజీవనం.. పట్టుకొని చావగొట్టిన భార్య..

ఉద్యోగానికి వెళ్తున్నాని చెప్పి ప్రియురాలితో సహజీవనం.. పట్టుకొని చావగొట్టిన భార్య..

ఉద్యోగానికి వెళ్తున్నానని చెప్పి  హైదరాబాద్, వైజాగ్ లాంటి సిటీల్లో సహజీవనం చేస్తున్న ఓ వ్యక్తిని తన భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని చితకబాదింది. ఏపీలోని కృష్ణా జిల్లాలో జరిగింది ఈ ఘటన. శనివారం ( అక్టోబర్ 3 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..  కృష్ణా జిల్లాకు చెందిన నరేంద్ర, ప్రియాంకలకు పదిహేనేళ్ల క్రితం పెళ్లయ్యింది. వీరికి ఒక కొడుకు. కొడుకు పుట్టిన ఆరు నెలల నుంచి భార్యకు దూరంగా ఉంటున్నాడు నరేంద్ర.

తనకు ఉద్యోగం వచ్చిందంటూ హైదరాబాద్, వైజాగ్ లాంటి సిటీల్లో ప్రియురాలితో కలిసి సహజీవనం చేస్తున్నాడు నరేంద్ర. ఈ క్రమంలో తన భర్త గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో మరో మహిళతో ఉంటున్నాడని తెలుసుకున్న ప్రియాంక తన సోదరుడితో కలిసి వెళ్లి భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.

సెల్ ఫోన్ లో రికార్డ్ చేస్తూ భర్తను చితక్కొట్టింది ప్రియాంక. తనను పెళ్లి చేసుకొని పిల్లల్ని కని.. మరొక మహిళతో సహజీవనం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నరేంద్రను చావగొట్టింది ప్రియాంక. 

ALSO READ : బేగంపేట నుంచి సచివాలయం వరకు..

ఉద్యోగం అని చెప్పి ఇంటికి కూడా రాకుండా ప్రియురాలితో ఉంటున్నాడని.. తాను ఫోన్ చేస్తుంటే నంబర్ బ్లాక్ చేశాడని.. ప్రియురాలు లేనప్పుడు కాల్ చేసి దుబాయ్ లో ఉద్యోగం వచ్చింది వెళ్తున్నానని అంటున్నాడని తెలిపింది ప్రియాంక. ఈ ఘటనపై ప్రియాంక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.