188తో నాటౌట్: T20లో పరుగుల సునామీ.. క్రిస్ గేల్ 13 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన సౌతాఫ్రికా కుర్రాడు!

188తో నాటౌట్: T20లో పరుగుల సునామీ.. క్రిస్ గేల్ 13 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన సౌతాఫ్రికా కుర్రాడు!

Lhuan dre Pretorius: సౌతాఫ్రికాకు చెందిన 20 ఏళ్ల యువ సంచలనం లూవాన్-డ్రే ప్రిటోరియస్ (Lhuan-dre Pretorius) టీ20 క్రికెట్ చరిత్రలో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. సీఎస్‌ఏ టీ20 ఛాలెంజ్ (CSA T20 Challenge) టోర్నమెంట్‌లో భాగంగా టైటాన్స్ (Titans), నైట్స్ (Knights) జట్ల మధ్య బ్లూమ్‌ఫొంటెయిన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ప్రిటోరియస్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట గత 13 ఏళ్లుగా ఉన్న అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును ఈ యంగ్ ప్లేయర్ బ్రేక్ చేసేశాడు. 

క్రిస్ గేల్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్: 

ఐపీఎల్‌- 2013లో  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున పూణే వారియర్స్‌పై క్రిస్ గేల్ సాధించిన అజేయ 175 పరుగుల రికార్డును ప్రిటోరియస్ తాజాగా బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో ప్రిటోరియస్ కేవలం 79 బంతుల్లోనే 15 ఫోర్లు, 13 సిక్సర్లతో నాటౌట్ గా నిలిచి 188 పరుగులు బాదాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతడు 237.97 అద్భుతమైన స్ట్రైక్ రేట్‌‌తో బ్యాటింగ్ చేయడం విశేషం. కేవలం 12 రన్స్ తేడాతో టీ20 క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించిన తొలి బ్యాటర్‌గా నిలిచే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు.

రికార్డుల మోత మోగించిన ఇన్నింగ్స్: 

* ప్రిటోరియస్ కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా, 40 బంతుల్లో సెంచరీని కంప్లీట్ చేసుకున్నాడు. ఆ తర్వాత కేవలం 58 బంతుల్లోనే 150 రన్స్ మైలురాయిని దాటాడు.

ALSO READ : క్రికెట్లో పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్..

* ఈ ఇన్నింగ్స్ ద్వారా మెన్స్ టీ20 క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్‌గా ప్రిటోరియస్ చరిత్ర పుస్తకాల్లో నిలిచాడు.

* డెవాల్డ్ బ్రెవిస్ పేరిట ఉన్న 162 పరుగుల సీఎస్‌ఏ టీ20 ఛాలెంజ్ రికార్డును కూడా ప్రిటోరియస్ బ్రేక్ చేసేశాడు.

* ఈ మెరుపు ఇన్నింగ్స్ సహాయంతో టైటాన్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో 267/3 స్కోరు సాధించింది. ఇది టోర్నమెంట్ చరిత్రలోనే రెండవ అత్యధిక స్కోరు కావడం గమనార్హం.

* సెప్టెంబర్‌లో జింబాబ్వే, నమీబియాతో జరిగిన ట్రై-సిరీస్‌లోనూ 94, 101 పరుగులు చేసి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ప్రిటోరియస్.. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌‌లోనే ఈ చారిత్రాత్మక ఇన్నింగ్స్‌తో తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు.