నన్ను ఆ సినిమాలో తీసుకోండి ప్లీజ్.. బన్నీ-అట్లీ 'రాకా' రూమర్లపై ఐశ్వర్య లక్ష్మి క్రేజీ కామెంట్స్!

నన్ను ఆ సినిమాలో తీసుకోండి ప్లీజ్.. బన్నీ-అట్లీ 'రాకా' రూమర్లపై ఐశ్వర్య లక్ష్మి క్రేజీ కామెంట్స్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ డైరెక్టర్ - అట్లీ కాంబినేషన్ వస్తున్న మూవీ 'రాకా'.  శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు తిరగరాయడానికి సిద్ధమువుతోంది.  అయితే గత కొన్ని రోజులుగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో మలయాళీ ముద్దుగుమ్మ ఐశ్వర్య లక్ష్మి నటిస్తోందంటూ వార్తలు వచ్చాయి. అంతేకాదు  ఇందులో ఒక పవర్ ఫుల్ నెగెటివ్ షేడ్ ఉన్న రోల్ చేస్తోందంటూ నెట్టింట గుసగుసలు బాగా వినిపించాయి.

ఈ ఊహాగానాలకు ఐశ్వర్య లక్ష్మి తన మార్క్ చమక్కుతో సమాధానమిస్తూ ఫుల్ స్టాప్ పెట్టేశారు. లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రచారంపై స్పందిస్తూ.. అయ్యో.. అవన్నీ రూమర్స్ మాత్రమే.  నేను 'రాకా' చిత్రంలో నటించడం లేదు.  ఎవరైనా నన్ను ఆ సినిమాలో తీసుకోండి ప్లీజ్.. అంటూ చాలా సరదాగా రిక్వెస్ట్ చేసేశారు. ఆమె స్పందనతో ఈ క్రేజీ రూమర్లకు తెరపడినట్లయింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్లోబల్ రేంజ్ మేనియాతో రూపొందుతున్న ఈ మాస్ అండ్ ఫాంటసీ యాక్షన్ డ్రామాలో తారాగణం మాత్రం కళ్ళు చెదిరేలా ఉందనేది ఫిల్మ్ నగర్ సమాచారం. సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ దీపికా పదుకొణె కథానాయికగా అలరించనుంది.