టాలీవుడ్‌లో రా అండ్ రస్టిక్ యాక్షన్ జోనర్ తెరకెక్కుతున్న సినిమా 'జంగా'. టాలెంటెడ్ హీరో త్రిగుణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా మూవీ మేకర్స్ మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రముఖ నటుడు మధునందన్ పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకుని, ఆయనకు సంబంధించిన ఫస్ట్ లుక్ క్యారెక్టర్ పోస్టర్‌ను యూనిట్ అధికారికంగా విడుదల చేసింది. ఈ బర్త్ డే స్పెషల్ పోస్టర్‌తో సినిమాలో ఆయన పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేశారు.
ఈ పోస్టర్‌లో మధునందన్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ లుక్‌లో అత్యంత సీరియస్‌గా కనిపిస్తున్నారు. ఆయన ఏదో ఒక విషయాన్ని తదేకంగా పరిశీలిస్తున్నట్లుగా ఉన్న ఈ పోస్టర్ సినిమాపై క్యూరియోసిటీని విపరీతంగా పెంచేస్తోంది. ఆయన పాత్ర కథలో ఎంతో కీలకమని, స్టోరీని మార్చే శక్తి ఈ క్యారెక్టర్‌కు ఉంటుందని పోస్టర్ చూస్తే స్పష్టమవుతోంది.
శ్రీమతి వనిత కిలారి సమర్పణలో ఆర్‌కె ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై రమ్య కిలారి, జయచంద్ర నాయుడు కిలారి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కెవిన్ గడ్డం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ సౌరభ్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘బిగ్ బాస్ తెలుగు 10’లో త్రిగుణ్..
సినిమా హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న త్రిగుణ్ ప్రస్తుతం ‘బిగ్ బాస్ తెలుగు 10’లో కంటెస్టెంట్‌గా సందడి చేస్తున్నారు. సెప్టెంబర్‌లో ప్రారంభమైన ఈ సీజన్‌లో రెండో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టిన త్రిగుణ్.. తన గేమ్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. మరి త్రిగుణ్.. హౌజ్ లో ఉండగానే ‘జంగా’ సినిమా రిలీజ్ అవుతుందా? మేకర్స్ వెయిట్ చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.
