Flydubai విమానం దాడి ఘటనలో.. కో పైలట్ ఉగ్రవాది? సంచలన విషయాలు వెలుగులోకి

Flydubai విమానం దాడి ఘటనలో.. కో పైలట్ ఉగ్రవాది? సంచలన విషయాలు వెలుగులోకి

Flydubai విమానంలో భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌పై దాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కో-పైలట్ ను ఒమన్ కు చెందిన హమామ్ అల్హమామి గా గుర్తించారు.  కోపైలట్ హమామి ఉగ్రవాద భావజాలం ఉన్నట్లు అధికారులు  అనుమానిస్తున్నారు.  వారి అనుమానాలకు అతనో తీవ్రవాద భావజాలం ఉన్న వ్యక్తిగా పలు అంతర్జాతీయ మీడియా సంస్థల రిపోర్టులు తోడయ్యాయి. 

హమామ్ తన జీవితంలో ఎక్కువ కాలాన్ని ఒమన్ వెలుపల, సిరియాలోనే గడిపినట్లు దర్యాప్తు సంస్థల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. హమామ్ అల్హమామి సిరియాలో ఉన్న సమయంలోనే ఉగ్రవాద భావజాలానికి ప్రభావితుడయ్యాడని అంతర్జాతీయ మీడియా సంస్థ అల్ అరేబియా వెల్లడించింది.  హమామ్ ఉగ్రవాద ఆలోచనలు తెలిసి గతంలో అతడిని ఒమన్ దేశంలో విమానాలు నడపకుండా అక్కడి అధికారులు నిషేధించడంతో అతను యూఏఈ (UAE) కి చేరుకున్నాడని  రిపోర్టులు చెబుతున్నాయి. 

అల్ అరేబియా నివేదిక ప్రకారం.. హమామ్ గతంలో సిరియాలో ఉన్న సమయంలో తీవ్రవాద భావజాలానికి ప్రభావితమైనట్లు దర్యాప్తు వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ కారణంగా ఒమన్‌లో అతడిని విమానాలు నడపకుండా అధికారులు నిషేధించినట్లు సమాచారం. అనంతరం అతడు ఒమన్ విడిచి యూఏఈకి వెళ్లినట్లు నివేదిక స్పష్టం చేసింది. 

హమామ్ తన జీవితంలో ఎక్కువ కాలం ఒమన్ వెలుపల, ముఖ్యంగా సిరియాలో గడిపినట్లు దర్యాప్తు సంస్థల వర్గాలు తెలిపినట్లు అల్ అరేబియా వెల్లడించింది. అతడి గత కార్యకలాపాలు, భావజాలం, విమానయాన రంగంలో పనిచేసిన వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

ఈ విషయంపై CNN కూడా పలు కీలక వివరాలను వెల్లడించింది. తీవ్రవాద భావజాలంపై ఆందోళనల కారణంగా హమామ్‌ను గతంలో ఒమన్ జాతీయ విమానయాన సంస్థలోని ఉద్యోగం నుంచి తొలగించినట్లు చెబుతోంది. 

హమామ్.. యూఏఈలో జన్మించినట్లు అతడి ప్రొఫైల్ చెబుతోంది. అతడి తండ్రి ఒమన్‌కు చెందినవారు కాగా, తల్లి సిరియాకు చెందిన మహిళగా గుర్తించారు. అతను గతంలో రాయల్ ఎయిర్ మొరాకోలో కూడా పనిచేసినట్లు తెలుస్తోంది. ఫ్లైదుబాయ్‌లో హమామ్ సుమారు ఎనిమిది నెలలుగా పనిచేస్తున్నట్లు CNN పేర్కొంది.

కో పైలట్ గా ఎలా చేరాడు?

ఒమన్ ఇజ్రాయెల్‌ను అధికారికంగా గుర్తించని క్రమంలో ఒమన్ పౌరుడైన హమామ్ టెల్ అవీవ్ వెళ్లే విమాన సిబ్బందిలో ఎలా చేరాడనే అంశంపై కూడా దర్యాప్తు జరుగుతోంది. ఈ వ్యవహారంపై షిన్ బెట్, మొస్సాద్, ఇజ్రాయెల్ సైన్యం, రవాణా మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు విచారణ చేపట్టినట్లు CNN తెలిపింది.

మరోవైపు, హమామ్ వద్ద పాలస్తీనా అనుకూల ప్రచార సామగ్రి,  ఫ్రీ పాలస్తీనా గ్రూపులకు సంబంధించిన కరపత్రాలు లభించినట్లు ఐ24 న్యూస్ ఒక ఎమిరేటీ వర్గాన్ని ఉటంకిస్తూ రాసింది. పాలస్తీనాకు అతను గతంలో మద్దతు తెలిపినట్లు వచ్చిన ఆరోపణలను కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

అయితే హమామ్‌పై వచ్చిన తీవ్రవాద భావజాలం, రాడికలైజేషన్‌కు సంబంధించిన ఆరోపణలు ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న అంశాలే. ఫ్లైదుబాయ్ విమానంలో కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై దాడి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, దాడి వెనుక ఉద్దేశం దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమయ్యే అవకాశం ఉంది.