నస్పూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా పరిధిలో నిర్వహిస్తున్న 9 సాంఘీక సంక్షేమ గురుకులాల్లో 2026–27 విద్యా సంవత్సరానికి 5 నుంచి 9వ తరగతి వరకు ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు స్పాట్ అడ్మిషన్ కౌన్సెలింగ్/సెలక్షన్స్ నిర్వహిస్తారని కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 5 బాలుర స్కూళ్లు, 4 బాలికల గురుకులాల్లో ఈ నెల 20 నాటికి పలు కేటగిరీల్లో అందుబాటులో ఉండే ఖాళీల ఆధారంగా అదే రోజు స్పాట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారని తెలిపారు.
వీటీజీ సెట్/బీఎల్వీ సెట్2026 ప్రవేశ పరీక్షకు హాజరైన బాలబాలికలు మాత్రమే ఈ స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని స్పష్టం చేశారు. అర్హత కలిగినవారు 20వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలలోపు కలెక్టర్ లో స్వయంగా హాజరై దరఖాస్తు చేసుకోవాలన్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత మెరిట్ జాబితా రూపొందించి, నిబంధనల ప్రకారం ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. దరఖాస్తుతో పాటుసెట్/ బీఎల్వీ సెట్ ర్యాంక్ కార్డు, కులం, బోనఫైడ్, ఆర్ఫన్, సెమీఆర్ఫన్, ఇతర ధ్రువపత్రాలు జత చేయాలని సూచించారు.
