బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించాలని ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో సోమవారం బీఆర్ఎస్నాయకులు ధర్నా చేశారు.
పేదలకు ఉపయోగపడే పథకాలపై కోర్టు స్టేవిధించిందని, దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయా పథకాలను నిలిపివేసేందుకు చూస్తోందని ఆరోపించారు. పేదలకు ఉపయోగపడే పథకాలను నిలివేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.
ఈ సందర్భంగా పలుచోట్ల సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. అనంతరం ఆఫీసర్లకు వినతిపత్రాలను అందజేశారు.-వెలుగు, నెట్వర్క్
