యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. సెలవు రోజు కావడంతో శుక్రవారం ( అక్టోబర్ 2 ) ఆలయానికి పోటెత్తారు భక్తులు. ఇవాళ గాంధీ జయంతి, రేపు, ఎల్లుండి వరుస సెలవులు కావడంతో ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లలో బారులు తీరారు భక్తులు.
ఈ క్రమంలో ఉచిత ప్రవేశానికి దాదాపు రెండు గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశానికి గంట సమయం పడుతోంది. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ప్రసాద విక్రయశాల దగ్గర కూడా సందడి నెలకొంది. ఆలయంలో నిర్వహించిన స్వామివారి కల్యాణ మహోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తుల రద్దీకి తగినట్లుగా ఏర్పాట్లు చేశారు అధికారులు.
ఈ మూడు రోజుల పాటు భక్తుల రద్దీ ఉండే అవకాశం ఉన్న క్రమంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు అధికారులు.
