కరీంనగర్ లో పాడి రైతుల ర్యాలీ.. డెయిరీ భూములను తెలంగాణ ఫెడరేషన్ పేరిట మార్చారని నిరసన

కరీంనగర్ లో పాడి రైతుల ర్యాలీ.. డెయిరీ భూములను తెలంగాణ ఫెడరేషన్ పేరిట మార్చారని నిరసన

కరీంనగర్, వెలుగు : కరీంనగర్ డెయిరీకి సంబంధించిన భూములను తెలంగాణ డెయిరీ డెవలప్ మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ కిందికి మార్చడాన్ని నిరసిస్తూ డెయిరీ పరిధిలోని పాడి రైతులు సోమవారం ర్యాలీ నిర్వహించారు.

 కరీంనగర్ డెయిరీ వద్ద ప్రారంభమైన ఈ నిరసన ర్యాలీ కలెక్టరేట్ వరకు సాగింది. అనంతరం డెయిరీ చైర్మన్ రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ చౌక్ లో రాజేశ్వర్ రావు మాట్లాడుతూ కరీంనగర్ డెయిరీకి చెందిన 11.32 ఎకరాల భూమిని ఎలాంటి సమాచారం ఇవ్వకుండా భూభారతి పోర్టల్‌‌‌‌లో తెలంగాణ డెయిరీ డెవలప్‌‌‌‌మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ కిందికి మార్చడం సరికాదన్నారు. 

ఆ భూమిపై కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ కు చట్టబద్ధంగా అన్ని హక్కులు ఉన్నాయని, కానీ తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఫెడరేషన్ పేరిట మార్చారని మండిపడ్డారు. అలాగే పెండింగ్ లో ఉన్న పాడిరైతుల రూ.4 ప్రోత్సాహకాన్ని విడుదల చేయాలని, ప్రతి పాడి రైతుకు 50 శాతం సబ్సిడీపై రెండు బర్రెలను అందజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వివిధ జిల్లాలకు చెందిన పాడి రైతులు పాల్గొన్నారు.