శంకరపట్నం, వెలుగు: ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఆయన పీఏ మురళీధర్ నియోజకవర్గంలో ఇసుక, మట్టి మాఫియా చేస్తూ వందల కోట్ల అవినీతికి పాల్పడుతున్నారని కరీంనగర్జిల్లా మానకొండూర్మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆరోపించారు. శంకరపట్నం మండలం కేశవపట్నంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మత్స్యకారులకు చేపలు పెంచుకొని ఉపాధి పొందే చెరువులన్నింటిలో మట్టి దందాకు తెరలేపారని ఆరోపించారు. రైతుల పంట పొలాలకు మట్టి తరలిస్తున్నామని చెప్పి భారీ స్థాయిలో మట్టిని ఇతరులకు తరలించి ఎమ్మెల్యే, అతడి అనుచరుడు వందల కోట్ల అవినీతికి తెలిపారని ఆరోపించారు. రోడ్లన్నీ గుంతలమయంగా మారాయని, ఎలాంటి రిపేర్లు చేయడం లేదని మండిడ్డారు. కల్వల ప్రాజెక్టుకు గండిపడి రైతులు కన్నీరు పెడుతుంటే ఇప్పటివరకు రిపేర్లు చేయలేదని విమర్శించారు.
