మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ ను విస్తరించింది తమిళనాడు ప్రభుత్వం. 2026 అక్టోబర్ 02న గాంధీ జయంతి సందర్భంగా పథకాన్ని మరింత మందికి చేరువయ్యేలా విస్తరించారు సీఎం విజయ్. ఈ సందర్భంగా సీఎం విజయ్ కండక్టర్ గా మారి.. స్వయంగా మహిళలకు టికెట్లు అందజేశారు.
టీవీకే ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వెట్రి పయనం పథకంలో రోజూవారి ప్రయాణంలో ఇప్పటి వరకు కొన్ని పరిమితులు ఉండేవి. అన్ని లిమిట్స్ ఎత్తివేసి.. అన్ని ఆదాయ వర్గాల మహిళలకు ఈ పథకం వర్తించేలా విస్తరించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం 84 లక్షల మంది మహిళలు లబ్ది పొందనున్నారు. డీలక్స్, ఎక్స్ ప్రెస్ బస్సు సేవలు కూడా మహిళలు వినియోగించుకోనున్నారు.
ముఖ్యమంత్రికి స్పెషల్ గిఫ్ట్:
ఉచిత బస్సు పథకం విస్తరణ సందర్భంగా సీఎం విజయ్ బస్సులో స్వయంగా టికెట్లు పంచారు. ఈ సందర్భంగా బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థినులు సీఎం కు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. సీఎంకు డైరీ మిల్క్ చాక్లెట్ ఇచ్చారు. చాక్లెట్లను సంతోషంగా స్వీకరించారు సీఎం విజయ్.
🚨 CM Joseph Vijay expands the free bus travel scheme for women, personally printing and handing over tickets to women as he kick-starts the initiative. pic.twitter.com/DxqoYL9eDC
— Vaagai News (@vaagaimedia) October 2, 2026
