జగిత్యాల రూరల్ లో ఉచిత ‘అర్జెంట్  కేర్ సెంటర్’ ప్రారంభం

జగిత్యాల రూరల్ లో  ఉచిత ‘అర్జెంట్  కేర్ సెంటర్’ ప్రారంభం

జగిత్యాల రూరల్, వెలుగు: గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచితంగా అత్యవసర వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా శ్రీ సత్యసాయి సుజల స్రవంతి ట్రస్ట్ ఆధ్వర్యంలో జగిత్యాల రూరల్ టీఆర్ నగర్, రాజారాం గ్రామం వద్ద ఏర్పాటు చేసిన 'సాయి స్వస్థ షా హ్యాపినెస్ అర్జెంట్ కేర్ సెంటర్'ను ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్ సమీండ్ల వాణి సోమవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జగిత్యాల, మల్యాల నియోజకవర్గాల పరిధిలోని గ్రామీణ ప్రజలకు ఈ కేంద్రం ద్వారా ఉచితంగా అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. అత్యవసర పరిస్థితుల్లో పేద, మధ్యతరగతి కుటుంబాలకు సకాలంలో వైద్యం అందించడం ద్వారా అమూల్యమైన ప్రాణాలను కాపాడవచ్చన్నారు. ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలకు తోడుగా, ఇలాంటి సేవా సంస్థల భాగస్వామ్యంతో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను విస్తరింపజేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దినేశ్, డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య తదితరులు పాల్గొన్నారు.