ఆసిఫాబాద్, వెలుగు: పోలీస్ రిక్రూట్ మెంట్లో ఆదివాసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఇందుకు నిరసనగా ఈనెల 19న ఆసిఫాబాద్ జిల్లా ఏజెన్సీ బంద్ పాటించాలని తుడుం దెబ్బ జిల్లా కమిటీ కోరింది. తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు కోవ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో సమావేశం నిర్వహించారు. తుడుందెబ్బ కేంద్ర, రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు బుధవారం చేపట్టనున్న ఏజెన్సీ బందుకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఆదివాసీ నాయకులు, విద్యార్థులు, యువత, వ్యాపారులు, ప్రజలకు పిలుపునిచ్చారు. సమావేశంలో పలువురు నేతలు పాల్గొన్నారు.
