సునీల్, అఖిల్ ఉడ్డెమారి, డా. శ్రీవాణి గోపిచంద్, వైష్ణవి, సిద్ధార్థ్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘ఫైట్ మహా’. కలలు నిజమైతే నిజం ఎవరిది అనేది ట్యాగ్ లైన్. ఆనంద్ చంద్ర దర్శకత్వంతోపాటు ఏవీఎస్ రాజు, ఆర్ కుమార్ రాజుతో కలిసి నిర్మించారు.
ఆగస్టు 21న సినిమా విడుదల కానుంది. తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. స్లీప్ వాకింగ్, కలలు, మానసిక సంఘర్షణల నేపథ్యంలో సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించినట్టు దర్శక నిర్మాతలు తెలియజేశారు.
