ఖమ్మం, వెలుగు: సీతారామ ప్రాజెక్టు ద్వారా సత్తుపల్లి ట్రంక్ మూడో పంప్ హౌస్ నుంచి నాలుగో పంప్ హౌస్ మధ్య భూసేకరణకు ప్రభుత్వం రూ.45 కోట్లు రిలీజ్ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట, అశ్వారావుపేట మండలాల పరిధిలో 532 ఎకరాల భూసేకరణకు ఈ నిధులను వినియోగించనున్నారు.
ఈ భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి, మూడో పంప్ హౌస్ నుంచి నాలుగో పంప్ హౌస్ ద్వారా నీటిని విడుదల చేసేందుకు అవసరమైన పనులను స్పీడప్ చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఈ సీజన్‌లోనే ఆయకట్టుకు నీరు అందించేలా పనులు చేపట్టాలని సూచించారు.
