ఖమ్మం, వెలుగు: ఖమ్మంలో ఇంటిగ్రేటెడ్ ఆర్డీవో కార్యాలయ సముదాయ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెవెన్యూ(డీఏ–సీఎంఆర్‌ఎఫ్) విభాగం కార్యదర్శి లోకేశ్‌కుమార్ శనివారం జీవో ఆర్టీ నంబర్ 596 జారీ చేశారు.
ఖమ్మం ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందించేందుకు ఇంటిగ్రేటెడ్ ఆర్డీవో కార్యాలయ సముదాయాన్ని మంజూరు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని, సీఎం రేవంత్‌రెడ్డిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలుమార్లు కోరారు. ఈ మేరకు లేఖలు కూడా సమర్పించారు. తాజాగా ఉత్తర్వులు వెలువడటంతో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి తుమ్మల కృతజ్ఞతలు తెలిపారు.
